2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం: కలెక్టర్‌

Mar 12 2026 7:10 AM | Updated on Mar 12 2026 7:10 AM

2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం: కలెక్టర్‌

2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలు, దేశాభివృద్ధికి కీలకమని, జనగణన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కలెక్టర్‌, ప్రధాన జనాభా గణన అధికారి తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలో జనాభా గణన–2027 సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా, మండల, మున్సిపల్‌ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో జనాభా గణనను సమర్థమంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం శిక్షణ నిర్వాహకులు, సీపీఓ కిషన్‌ నాయక్‌ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనాభా గణాంక అధికారులు యువేందర్‌ బాబు, రవీంద్ర నాయక్‌, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, ఆర్డీఓలు వేణుమాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసు, మాస్టర్‌ ట్రైనర్‌ రమేష్‌, వివిధ మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement