‘పరిశుభ్రత’లో భాగస్వాములవ్వాలి | - | Sakshi
Sakshi News home page

‘పరిశుభ్రత’లో భాగస్వాములవ్వాలి

Mar 7 2026 9:31 AM | Updated on Mar 7 2026 9:31 AM

సూర్యాపేట అర్బన్‌ : ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీలో మార్చి 15 వరకు నిర్వహించే పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ పిలుపు నిచ్చారు. ప్రజా పాలన– ప్రగతి కార్యాచరణలో మొదటి థీమ్‌గా చేపట్టిన ‘పరిశుభ్రత’ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక మున్సిపాలిటీ వద్ద మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొరిశెట్టి నివేదితతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం నుంచి కల్నల్‌ సంతోష్‌ బాబు చౌరస్తా వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న పెండింగ్‌ ఫైల్స్‌ క్లియరెన్స్‌పై దృష్టి సారించాలని ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్‌ హన్మంతరెడ్డి పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షఫీ ఉల్లా, ఈఈ కిరణ్‌, సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సారగండ్ల శ్రీనివాస్‌, అధికారులు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

విజయవంతం చేయాలి

సూర్యాపేట : 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌ కోరారు. శుక్రవారం మండలంలోని బాలెంల గ్రామపంచాయతీ కార్యాలయంలో 99 రోజుల కార్యక్రమం అమలుపై నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కిచెన్‌ షెడ్డు, స్టోర్‌ రూమ్‌, వంటశాల, కంప్యూటర్‌ రూమ్‌ ల్యాబ్‌ పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, ఆర్డీఓ వేణు మాధవరావు, తహసీల్దార్‌ కృష్ణయ్య, ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంపీఓ లింగారెడ్డి, హెచ్‌ఎం ప్రసాద్‌, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement