లిప్టు పనులు పూర్తిచేయాలి
మేళ్లచెరువు : సెప్టెంబరు నాటికి రాజీవ్‌గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మంగళవారం చింతలపాలెం మండలం దొండపాడు గ్రామం పరిధిలో గల లిఫ్ట్ పంపును పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. లిప్టు ద్వారా హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని 5 మండలాల్లో 12 గ్రామాలల్లో ని భూములకు సాగు నీరు అందించడం జరుగుతుందన్నారు. 394 కోట్ల రూపాయలతో నిర్పిస్తున్న లిప్టు పనులు వేగవంతం గా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు రమేష్‌బాబు, ఎస్‌ఈ నాగభూషణం, దొండపాడు సర్పంచ్ చెన్నకేశి వెంకయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.


