ముస్లింలకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

ముస్లింలకు అండగా ఉంటాం

Mar 10 2026 7:09 AM | Updated on Mar 10 2026 7:09 AM

భానుపురి (సూర్యాపేట) : ఢిల్లీ నుంచి గల్లీ దాకా ముస్లింలకు అండగా నిలబడేది ఒక్క కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్‌ విందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్‌ ఇఫ్తార్‌ విందులో పాల్గొనడడం సంతోషంగా ఉందన్నారు. సూర్యాపేటలో షాదీఖానా, కమ్యూనిటీ హాల్‌, ఖబరస్తాన్‌ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మొరిశెట్టి నివేదితా లక్షాది, పీసీసీ కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు శంకుస్థాపన

రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నూతనంగా రూ.10 కోట్లతో నిర్మించనున్న రోడ్లు, భవనాల అతిథి గృహానికి (గెస్ట్‌హౌస్‌) మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, ఆర్డీఓ వేణు మాధవరావు పాల్గొన్నారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement