భూ ఆక్రమణపై ‘డెక్కన్‌’ లో విచారణ | - | Sakshi
Sakshi News home page

భూ ఆక్రమణపై ‘డెక్కన్‌’ లో విచారణ

Mar 10 2026 7:09 AM | Updated on Mar 10 2026 7:09 AM

పాలకవీడు : మండలంలోని రావిపహాడ్‌ గ్రామం భవానీపురంలో గల డెక్కన్‌ సిమెంట్స్‌ కంపెనీ యాజమాన్యం అటవీ భూముల ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుతో సోమవారం జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌ఓ) సతీష్‌కుమార్‌ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) ఆదేశాల మేరకు విచారణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అటవీ భూమి ఆక్రమిత స్థలంలో ఉన్న శాశ్వత నిర్మాణా లను పరిశీలించామని డీఎఫ్‌ఓ తెలిపారు. వీటి ఫొటోలు, వీడియోలు, పత్రాలతో కూడిన పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారు పసుపులేటి సురేష్‌ మీడియాతో మాట్లాడారు. అటవీ, మైనింగ్‌ భూముల మధ్య హద్దురాళ్లు ఏర్పాటు చే యలేదని ఆరోపించారు. డీఎఫ్‌ఓ నివేదికపై తనకు విశ్వాసం లేదని.. ఈ అంశాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని వెల్లడించారు. విచారణలో అటవీశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, డెక్కన్‌ సిమెంట్‌ కంపెనీ ప్రతినిధులు, ఫిర్యాదుదారుడు పాల్గొన్నారు.

వివాద నేపథ్యం ఇదీ..

డెక్కన్‌ సిమెంట్‌ కంపెనీ అటవీ భూముల ఆక్రమణకు పాల్పడినట్లు గతంలో వచ్చిన ఫిర్యాదులతో కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారించింది. సదరు పరిశ్రమ 8.02 హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమించి రైల్వేలైన్‌తో పాటు ఇతర శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించింది. అయితే ఆ భూమిని తాము పట్టాదారుల నుంచే కొనుగోలు చేశామని కంపెనీ ప్రతినిధులు వాదించారు. చివరకు 2023లో కేంద్ర అటవీ శాఖకు రూ.8 కోట్లు చెల్లించి ఆ భూమిని పరిశ్రమ క్రమబద్ధీకరించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఉన్నతాధికారులకు నివేదిస్తాం

జిల్లా అటవీశాఖ అధికారి సతీష్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement