సూర్యాపేట అర్బన్ : అసమానతలు లేని సమాజ నిర్మాణానికి పోరాడుదామని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక అన్నారు. సోమవారం ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ నుంచి లయన్స్ క్లబ్ వరకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళల పట్ల వివక్ష పోవాలన్నారుఉ. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షురాలు సూరం రేణుక, సహాయ కార్యదర్శి సంతోషిమాత, కట్టా కల్పన, చందనబోయిన లక్ష్మి, ఐతరాజు పద్మ,పేర్ల బయ్యక్క, వేమనూరు పావని, శ్యామల, ఎల్లమ్మ,గౌరమ్మ, సత్తెమ్మ మాలంబి, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.


