భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ప్రజా వాణిలో వివిధ సమస్యలకు సంబంధించి 80కిపైగా అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, డీఈఓ శ్రీధర్‌రెడ్డి, డీఈఓ అశోక్, సంక్షేమ అధికారులు నర్సింహారావు, నరసింహ, శంకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


