గోదావరి జలాల పెంపు | - | Sakshi
Sakshi News home page

గోదావరి జలాల పెంపు

Mar 14 2026 7:38 AM | Updated on Mar 14 2026 7:38 AM

అర్వపల్లి : గోదావరి జలాలను 1200 క్యూసెక్కుల నుంచి 1600 క్యూసెక్కులకు పెంచినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్‌, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్‌ తెలిపారు. చివరి భూములకు నీటిని అందించడానికి పెంచినట్లు చెప్పారు. రైతులు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని కోరారు.

కల్తీ నూనె దందాపై కదిలిన యంత్రాంగం

కోదాడ: పట్టణంలో కల్తీ నూనె దందాపై జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు విచారణ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కోదాడకు వచ్చిన అధికారులు స్తానికి పోలీస్‌ అధికారులతో కలిసి.. అయిల్‌ ట్యాంకర్‌ నుంచి నమూనాలు తీసుకున్నారు. పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. లారీలో రవాణా అవుతున్నది రైస్‌బ్రాన్‌ అయిల్‌గా గుర్తించామని, లారీ డ్రైవర్‌ అక్రమంగా ట్యాంకర్‌ సీలు తొలగించి చిన్న డబ్బాలలో నింపి ఆటోలో తరలిస్తున్నట్లు గుర్తించామని, కోదాడలో దీన్ని ఎవరి వద్దకు తరలిస్తున్నారన్న విషయం తేలాల్సి ఉందన్నారు. ట్యాంకర్‌కు లైసెన్స్‌ ఉన్నప్పటికి రవాణా సమయంలో సీల్‌ పటిష్టంగా లేకపోవడాన్ని గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. ల్యాబ్‌ నుంచి రిపోర్టు వచ్చిన తరువాత నూనెలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట పుడ్‌ సేప్టీ అధికారి బి.ప్రభాకర్‌ తెలిపారు.

సమర్థవంతంగా

సేవలందించాలి

సూర్యాపేటటౌన్‌ : గర్భిణులు, తల్లులకు ఆరోగ్య కార్యకర్తలు సమర్థవంతంగా సేవలందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పెండెం వెంకటరమణ సూచించారు. జిల్లాలో పనిచేస్తున్న 301 మంది ఆరోగ్య కార్యకర్తలకు శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీల్డ్‌ స్థాయి ఆరోగ్య సిబ్బంది.. గర్భిణుల నమోదు, ప్రసవానికి ముందు పరీక్షలు, శిశు టీకాలు, నవజాత శిశు సంరక్షణపై మరింత శ్రద్ధ వహించాలన్నారు. ఈ శిక్షణ ద్వారా తల్లి, శిశు ఆరోగ్య సేవలు గ్రామ స్థాయిలో మరింత మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ నాజియా తబస్సుమ్‌, జిల్లా శిక్షణ నిర్వహణ అధికారి డాక్టర్‌ శ్రీశైలం పాల్గొన్నారు.

శ్రీలక్ష్మీనరసింహునికి

నిత్య కల్యాణం

మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి శుక్రవారం విశేషంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. నిత్య కళ్యాణంలో భాగంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను అలంకరించి ఎదుర్కోళ్లు, కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఆలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement