సూర్యాపేట టౌన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఫిబ్రవరి 26 న పరీక్షలు ప్రారంభమయ్యాయి. చివరి రోజు జరిగిన పరీక్షలకు మొత్తం 7,224 మంది విద్యార్థులకు 6,951 మంది హాజరు కాగా 273 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,960 మందికి 5,800 మంది హాజరు కాగా 160 గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విభాగంలో 1,264 మందికి 1,151 మంది హాజరు కాగా 113 మంది హాజరు కాలేదని డీఐఈఓ భానునాయక్ తెలిపారు. కాగా పరీక్షలు ముగియడంతో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో బస్టాండ్‌లు, ఆటో స్టాండ్‌లు సందడిగా కనిపించాయి.


