సుధా బ్యాంకుకు పురస్కారం.. గర్వకారణం | - | Sakshi
Sakshi News home page

సుధా బ్యాంకుకు పురస్కారం.. గర్వకారణం

Mar 14 2026 7:38 AM | Updated on Mar 14 2026 7:38 AM

సూర్యాపేట : అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ.. సుధా బ్యాంకుకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ పురస్కారం ప్రదానం చేయడం తెలంగాణకే గర్వకారణమని ప్రముఖ మోటివేషనల్‌ ట్రైనర్‌ ఆకెళ్ల రాఘవేంద్ర అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని త్రివేణి ఫంక్షన్‌ హాల్‌లో సుధా బ్యాంకు 52వ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సుధా బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ పెద్దిరెడ్డి గణేష్‌ పర్యవేక్షణలో కొనసాగుతున్న సుధా బ్యాంకు అగ్రశ్రేణి బ్యాంకుగా ఎదగాలని ఆకాంక్షించారు. బ్యాంకు చైర్మన్‌ మీలా మహదేవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సర్వసభ్య సమావేశానికి బ్యాంకు పాలకవర్గ సభ్యులు, బ్యాంకు మేనేజ్మెంట్‌ బోర్డ్‌ సభ్యులు వైస్‌ చైర్మన్‌ కక్కిరేణిచంద్రశేఖర్‌, డైరెక్టర్స్‌ ఏపూరి శ్రవణ్‌కుమార్‌, డాక్టర్‌ మీలా సందీప్‌, అప్పం శ్రీనివాస్‌ తోట శ్యాంప్రసాద్‌, డాక్టర్‌ మిన్న విజయలక్ష్మి, అనంతుల శారద, బాణావత్‌ సుజాత, స్వామి వెంకటేశ్వర్లు ఇరుకుల్లా చెన్నకేశవ రావు వెంపటి వెంకటరమణ, రింగు లక్ష్మీనారాయణ, భువనగిరి భాస్కర్‌, గండూరి శంకర్‌, పెద్దిరెడ్డి రాజా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement