హక్కుల సాధనకు ఏకం కావాలి | - | Sakshi
Sakshi News home page

హక్కుల సాధనకు ఏకం కావాలి

Feb 23 2026 6:49 AM | Updated on Feb 23 2026 6:49 AM

హక్కుల సాధనకు ఏకం కావాలి

హక్కుల సాధనకు ఏకం కావాలి

తిరుమలగిరి ( తుంగతుర్తి) : గిరిజనుల ఆరాధ్యదైవం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ స్ఫూర్తితో లంబాడీలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని ఆల్‌ ఇండియా బంజార సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లూనావత్‌ పాండునాయక్‌, కార్యదర్శి ధరావత్‌ వీరన్ననాయక్‌ అన్నారు. ఆదివారం మండలంలోని మొండిచింత తండాలో సర్పంచ్‌ లావుడ్యా శ్రీలతబాలాజీ నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకలో వారు పాల్గొన్నారు. ముందుగా భోగ్‌ బండార్‌ నిర్వహించి సేవాలాల్‌కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బంజారలకు సంక్షేమ పథకాలను అందించాలని కోరారు. అంతకు ముందు లంబాడీల వేషధారణలో మహిళలు చేసిన నృత్యాలు, కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఏఐబీఎస్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గుగులోతు నాగునాయక్‌, యూత్‌ జిల్లా అధ్యక్షుడు లావుడ్యా బాలాజీ నాయక్‌, ఉప సర్పంచ్‌ జాటోత్‌ శిరీష శీను, మాజీ సర్పంచ్‌ లావుడ్యా మోహన్‌ బాబు, గుగులోతు వెంకన్న నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement