సూర్యాపేటటౌన్ : ఎకై ్సజ్ అధికారులు వివిధ కేసులలో సీజ్ చేసిన 24 వాహనాలను గురువారం సూర్యాపేట ఎకై ్సజ్ స్టేషన్‌లో జిల్లా ఎకై ్సజ్ అధికారి లక్ష్మణ్‌నాయక్ ఆధ్వర్యంలో వేలం వేయనున్నట్లు ఎకై ్సజ్ సీఐ మల్లయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహనాల వేలంలో పాల్గొన దల్చిన వారు ఉదయం 9 గంటలకు ముందుగా ధరావతు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఇంటర్ పరీక్షలకు
264 మంది గైర్హాజరు
సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు జనరల్ విభాగంలో 5,927 మంది విద్యార్థులకు 5,764 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,467 మంది విద్యార్థులకు 1,366 మంది హాజరయ్యారు. మొత్తం 264 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ భానునాయక్ తెలిపారు.
రాష్ట్రంలో అరాచకం తప్ప
అభివృద్ధి లేదు
సూర్యాపేటటౌన్ : రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు తప్ప అభివృద్ధి ఏమీ లేదని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అరాచక శక్తులను ప్రోత్సహించడం సరికాదని, బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. స్థానిక మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు సరైన విచారణ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులు ఆపకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తానన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఉప్పల ఆనంద్, పెరుమాళ్ల అన్నపూర్ణ, నెమ్మాది భిక్ష, జీడీ భిక్షం, సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మట్టపల్లి ఆలయంలో
సంప్రోక్షణ
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పార్వతీ రామలింగేశ్వర ఆలయాల ద్వారాలను అర్చకులు బుధవారం ఉదయం 10 గంటలకు తెరిచారు. అనంతరం ఆలయాలలో సంప్రోక్షణ నిర్వహించారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఆర్జిత సేవలు, నిత్యకల్యాణం మాత్రం గురువారం వరకు నిలుపుదల చేశామని, 6వ తేదీ నుంచి యథావిధిగా కొనసాగుతాయని ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్ట పల్లిరావు, విజయ్‌కుమార్, ఇన్‌చార్జి ఈఓ జ్యోతి తెలిపారు.


