సోలాపూర్ నుంచి పట్టువస్త్రాలు
మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన చాట్లా శారీ సెంటర్‌కు చెందిన కేశవ్ చాట్లా, ఉమా చాట్లా, కృష్ణాకాంత్ చాట్లా, సోనాలి చాట్లాలు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం యాదగీరిశుడిని దర్శించుకున్న అనంతరం గోవర్ధనగిరిధారి అలంకార సేవ ముందు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తికి వారు పట్టువస్త్రాలు అందజేశారు. 8 పట్టు చీరలు, 5 పట్టు పంచెలను ఆలయాధికారులకు అందించామని, గత 25 సంవత్సరాలుగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు అందిస్తున్నామని కేశవ్ చాట్లా వెల్లడించారు.


