సీతారామంజనేస్వామి ఆలయంలో చోరీ
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మండలం కుప్పిరెడ్డిగూడెం గ్రామ శివారులోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ ముఖద్వారానికి వేసిన తాళాన్ని రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి లోపలికి వెళ్లి సీతమ్మ అమ్మవారి మెడలో ఉన్న రెండు గ్రాముల బంగారం పుస్తెలతాడు, హుండీలోని నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాలునాయక్ తెలిపారు.
మద్యం షాపులో..
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామ శివారులోని కేటీ అన్నారం క్రాస్ రోడ్‌లోని జీకే వైన్స్‌లో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు షాపు పైకప్పు ఊడదీసి లోపలికి ప్రవేశించి కౌంటర్‌లో ఉంచిన రూ.14,500 నగదు, ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం వైన్స్ క్యాషియర్ నాగరాజు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్‌ఐ బాలునాయక్ తెలిపారు.


