వర్గరహిత సమాజాన్ని నిర్మించేది మార్క్సిజమే | - | Sakshi
Sakshi News home page

వర్గరహిత సమాజాన్ని నిర్మించేది మార్క్సిజమే

Mar 15 2026 4:53 AM | Updated on Mar 15 2026 4:53 AM

సూర్యాపేట అర్బన్‌: దోపిడీ నుంచి కార్మిక వర్గం విముక్తి చెందాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ రద్దవ్వాలని, సోషలిస్ట్‌ సమాజాన్ని నిర్మించాలని చెప్పిన సిద్ధాంతకర్త కార్ల్‌మార్క్స్‌ అని సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంగారావు అన్నారు. సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన కార్ల్‌మార్క్స్‌ వర్ధంతిలో ఆయన మాట్లాడారు. ఉన్నవారే లాభాల పేరుతో అనుభవిస్తున్నారని , కార్మిక వర్గం శ్రమజీవులుగా, దోపిడీకి గురయ్యే వారుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టికి కారణం శ్రమజీవులే అన్నారు. శ్రమ దోపిడీ విముక్తి సిద్ధాంతాన్ని మార్క్స్‌ తన పెట్టుబడి గ్రంథం ద్వారా సమాజం ముందు పెట్టారన్నారు.

కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్‌, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కే సూర్యం, ఎస్‌ఎల్‌ పద్మ, జాతీయ ఉపాధ్యక్షుడు కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్‌, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్‌ కుమార్‌, సీపీఐ(ఎం.ఎల్‌) మాస్‌లైన్‌ పార్టీ జిల్లా నాయకుడు పేర్ల నాగయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement