టమాటా రైతు దిగాలు | - | Sakshi
Sakshi News home page

టమాటా రైతు దిగాలు

Mar 6 2026 8:04 AM | Updated on Mar 6 2026 8:04 AM

చివ్వెంల(సూర్యాపేట) : టమాటా రైతులు దిగాలు చెందుతున్నారు. పండించిన పంటకు సరైన మద్దతు ధర లేక నష్టాల పాలవుతున్నారు. చివ్వెంల మండల వ్యాప్తంగా సుమారు 100 ఎకరాల వరకు రైతులు టమాటా సాగు చేస్తున్నారు. మండలంలోని లక్ష్మణ్‌ నాయక్‌తండా, పాశ్చ్యానాయక్‌తండా, జయరాం గుడితండా, సేవాలాల్‌ తండా వట్టిఖమ్మంపహాడ్‌,, రోళ్లబండ తండా, పిల్లలజెగ్గు తండాల్లో సాగు చేస్తున్నారు. వరి స్థానంలో టమాటా పండిస్తున్నా ప్రస్తుతం ధర లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

పెట్టుబడి అధికమే..

రైతులు ఎకరా టమాటా సాగుకు పెట్టుబడి ఖర్చు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. మూడు నెలల 15లకు పంటకాలం పూర్తవుతుంది. నారు పెట్టిన సమయం నుంచి కాత సమయం వరకు పంటను పురుగు, తెగుళ్లు, ఆశిస్తుంది. వీటి నివారణకు మందులు పిచికారీ చేయాల్సి వస్తుంది. కాత కాసిన మొదటి వారంలో రెండు రోజులకు ఒకసారి పంట సుమారు 2.5 క్వింటాళ్లకు పైగా వస్తుంది. చిన్న సైజు టమాటా 25 కిలోల పెట్టె రూ.120, పెద్ద సైజు వాటికి 25 కిలోల పెట్టెకు రూ.160 పలుకుతుందని రైతులు పేర్కొంటున్నారు. చిన్న సైజు టమాటా ధర కిలో రూ.5, ఉండగా, పెద్ద సైజు టమాటా కిలో రూ.6 మాత్రమే ఉందని, ధర ఇలాగే కొనసాగితే తాము నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.

మద్దతు ధర లేక నష్టాలు

ఆందోళనలో అన్నదాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement