మేళ్లచెరువు : చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో తిరుపతమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎద్దుల పందేలు గురువారం రెండవ రోజు కొనసాగాయి. ఈ పోటీలను, అన్నదాన కార్యక్రమాలను సర్పంచ్ చెన్నకేశి వెంకయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, కలగొట్ల వెంకటేశ్వరరెడ్డి, చెన్నకేశి రామారావు, లక్ష్మీనారాయణ భక్తులు పాల్గొన్నారు.
బండ లాగుతున్న గిత్తలు


