అమరుల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ
సూర్యాపేట అర్బన్ : మాదిగ అమరవీరులు పోరాటాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ అమలు సాధ్యమైందని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్నమాదిగ అన్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ భవనంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకుడు ములకలపల్లి రవిమాదిగ అధ్యక్షతన ఆదివారం మాదిగ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యాతాకుల రాజన్న మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ సమాన పంపిణీ కోసం మంద కృష్ణమాదిగ నాయకత్వంలో అలుపెరుగని పోరాటం చేసి అనేక మంది మాదిగలు వీరమరణం పొందారని అన్నారు. పొన్నాల సురేంద్ర మాదిగ, దామోదర్ మాదిగ మహేష్ మాదిగ, భారతి మాదిగ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర కోశాధికారి చింత జాన్ విల్సన్, ములకలపల్లి రవి మాదిగ. ప్రభాకర్, ఎర్ర వీరన్న మాదిగ, గంట భిక్షపతి, ములకలపల్లి మల్లేష్ మాదిగ, మండల అధ్యక్షుడు మేడి కృష్ణ మాదిగ, పాలడుగు శ్రీనివాస్ మాదిగ, కత్తుల రవి మాదిగ, చెరుకుపల్లి కిరణ్‌కుమార్, మొండికత్తి మనోజ్‌కుమార్, గోపీచంద్, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు
యాతాకుల రాజన్న మాదిగ


