మొదటి రోజు 12,342 మంది హాజరు | - | Sakshi
Sakshi News home page

మొదటి రోజు 12,342 మంది హాజరు

Mar 15 2026 4:53 AM | Updated on Mar 15 2026 4:53 AM

ఫ ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు

సూర్యాపేటటౌన్‌ : పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కావడంతో విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. జిల్లాలో మొత్తం 69 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష కొనసాగింది. మొదటి రోజు తెలుగు పరీక్షకు 12355 మంది విద్యార్థులకు 12342 మంది హాజరయ్యారు. 13 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. తొమ్మిది మంది ప్రైవేట్‌ విద్యార్థులకు ఆరుగురు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, అడిషనల్‌ కలెక్టర్‌, డీఈఓ తనిఖీ చేశారు.

పరీక్ష కేంద్రాల పరిశీలన

పదో తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లా కేంద్రంలోని పలు కేంద్రాలను ఎస్పీ నరసింహ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, పరీక్షా సరళిని పరిశీలించి విధులు నిర్వహిస్తున్న ఎగ్జామినేషన్‌ సెంటర్‌ సిబ్బందికి, పోలీస్‌ సిబ్బందికి సూచనలు చేశారు.

విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది

పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement