నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి

Mar 15 2026 4:53 AM | Updated on Mar 15 2026 4:53 AM

సూర్యాపేట అర్బన్‌: ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాడుతున్న నిరుద్యోగ యువతపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ప్రయోగిస్తున్న అక్రమ నిర్బంధాన్ని ఆపాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్‌) రాష్ట్ర కోశాధికారి రవి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్‌ చేసి ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇస్తానని చెప్పి నేటి వరకు ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైంది కాదన్నారు. సమావేశంలో పీవైఎల్‌ జిల్లా అధ్యక్షుడు నల్గొండ నాగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వీరబోయిన రమేష్‌, కోశాధికారి బండి రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement