భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే.సీతారామారావు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల పనులు త్వరగా పూర్తిచేయాలి
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ పట్ట ణ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద కాలనీ ఇళ్ల పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం హుజూర్‌నగర్ పట్టణ శివారులోని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న సింగల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారంలోనే సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్లను అందించడానికి సిద్ధం చేయాలన్నారు. బ్లాక్‌ల మధ్య గల అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా, తాగునీరు, మొక్కలు నాటడం, పెయింటింగ్ పనులు, స్ట్రీట్ లైట్స్ మొదలైన అన్ని రకముల పెండింగ్ పనులు ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, మిషన్ భగీరథ ఈఈ కరుణాకర్ రెడ్డి, హార్టికల్చర్ పీడీ నాగయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ కవిత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


