అలుగు పారుతున్న కోదాడ పెద్దచెరువు | - | Sakshi
Sakshi News home page

అలుగు పారుతున్న కోదాడ పెద్దచెరువు

Feb 25 2026 10:35 AM | Updated on Feb 25 2026 10:35 AM

అలుగు పారుతున్న కోదాడ పెద్దచెరువు

అలుగు పారుతున్న కోదాడ పెద్దచెరువు

లక్ష్మీనారసింహుడికి

విశేష పూజలు

మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో మంగళవారం అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామికి తమలపాకులతో ప్రత్యేకపూజలు చేశారు. దేవాలయంలో లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ, హోమశాలలో నిత్యాగ్నిహోత్రి, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం, జరిపించారు. లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. నిత్య కల్యాణతంతులో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

కోదాడ : కోదాడ పెద్దచెరువు అలుగు పారుతోంది. మంగళవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి పెద్దచెరువులోకి భారీగా వరద నీరు చేరడంతో ఉదయం నుంచి చెరువు అలుగు పోస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement