తనిఖీలు చేస్తుండగా దొరికారు
కోదాడ : కోదాడ నియోజకవర్గంలో మద్యం దుకాణాల నిర్వాహకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పట్టణం, రూరల్ పరిధిలోని బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేసే విషయంలో పొత్తులు కుదరక పోవడంతో రగడ కొనసాగుతోంది. ఏకంగా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని తనిఖీలు చేస్తున్నారు. ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీయడానికి మరొకరు ప్రయత్నం చేస్తుండగా.. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రూరల్ వర్సెస్ టౌన్
కోదాడ నియోజకవర్గలోని ప్రతి గ్రామంలో పది చొప్పున బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. వాటికి సమీపంలోని వైన్స్‌ల నుంచి మద్యం సరఫరా అవుతోంది. కోదాడ మండలంలోని తెలంగాణ–ఏపీ సరిహద్దు ప్రాంతమైన నల్లబండగూడెం వద్ద మూడు మద్యం దుకాణాలకు ఎకై ్సజ్ అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే అక్కడ వ్యాపారం సరిగా సాగడం లేదని గతంలోనే అధికారుల అనుమతితో ఓ దుకాణాన్ని తాత్కాలికంగా గుడిబండకు మార్చారు. కొత్త దుకాణాలకు వేలం నిర్వహించినపుడు నల్లబండగూడెంలో రెండు, గుడిబండలో ఒక దుకాణాన్ని గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చారు.
తమ వద్దకు రాకుంటే సమాచారం లీక్
కోదాడ రూరల్ పరిధిలోని వైన్స్‌లు ఏడు గ్రామాలకు, కోదాడ పట్టణంలోని దుకాణాలు ఇతర గ్రామాలకు మద్యం సరఫరా చేయాలని అప్పట్లో నిర్ణయించారు. గతంలో గుడిబండ గ్రామానికి సమీపంలో ఉన్న పలు గ్రామాల బెల్ట్ దుకాణాల వారు కోదాడ నుంచి మద్యాన్ని తీసుకొని వెళ్లేవారు. ప్రస్తుతం గుడిబండలో వైన్స్ ఏర్పాటు చేసిన తరువాత ఇక్కడి నుంచే మద్యం తీసుకెళ్లాలని, రూరల్ పరిధిలోని గ్రామాల వారు టౌన్ నుంచి మద్యం తీసుకెళ్లవద్దని రూరల్ షాపుల వారు షరతు పెట్టారు. వారి మాటలను బేఖాతరు చేస్తూ ఇటీవల కొందరు గ్రామాల వారు కోదాడ నుంచి మద్యాన్ని తెచ్చుకోవడంతో రూరల్ పరిధి షాపుల నిర్వాహ కులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆటోలో తీసుకెళ్తున్న మద్యాన్ని రూరల్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ విషయమై పట్టణంలోని వైన్స్‌ల యజమానులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించడం పోలీసులు, ఎకై ్సజ్ అధికారులను ఇరకాటం పెడుతోంది. ఇంతలా మద్యం అక్రమ వ్యాపారం జరుగుతుంటే పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు ఏమి చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
గుడిబండ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మద్యంతో వెళ్తున్న వాహనం దొరకడంతో పట్టుకొని కేసు నమోదు చేశాం. మద్యాన్ని ఎకై ్సజ్ అధికారులకు అప్పగించాం.
– గోపాల్‌రెడ్డి, కోదాడ రూరల్ ఎస్‌ఐ
ఫ బెల్ట్ షాపులకు మద్యం
సరఫరాపై రగడ
ఫ తమ అనుచరులతో తనిఖీలు
ఫ కోదాడలో హాట్ టాపిక్‌గా
మద్యం వ్యవహారం


