నిమ్మ.. బస్తా రూ.2500 | - | Sakshi
Sakshi News home page

నిమ్మ.. బస్తా రూ.2500

Mar 15 2026 4:53 AM | Updated on Mar 15 2026 4:53 AM

రెండెకరాలకు 20 బస్తాలే వచ్చాయి..

నేను రెండు ఎకరాల్లో నిమ్మ సాగు చేశాను. వంద చెట్లు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో నిమ్మకు మంచి ధర ఉన్నప్పటికీ దిగుబడులు రాకపోవడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. నాకున్న వంద చెట్లకు గాను ఈ సీజన్‌లో 100 బస్తాల దిగుబడులు రావాల్సి ఉండగా 20 బస్తాలకు మించి రాలేదు. దీర్ఘకాలిక పంట అయిన నిమ్మకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిలడక ధరను నిర్ణయించి కొనుగోలు చేయాలి.

– యానాల శ్రీనివాస్‌రెడ్డి,

నిమ్మ రైతు నెల్లిబండ, నకిరేకల్‌ మండలం

నకిరేకల్‌ : నిమ్మకాయల రేటు ఒక్కసారిగా పెరిగింది. వేసవికాలం ప్రారంభం కావడంతో నిమ్మకాయలను ప్రజలు ఎక్కవగా వాడుతుండడంతో నిమ్మకు మంచి ధర వస్తోంది.. తెలంగాణలో ఏకై క నిమ్మ మార్కెట్‌ ఉన్న నకిరేకల్‌లో రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు నిమ్మ వ్యాపారం సాగుతుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబయి, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, చైన్నె, కలకత్తా ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం నకిరేకల్‌మార్కెట్‌లో నిమ్మ బస్తా (23 కేజీల టిక్కి) రూ.2000 నుంచి రూ.2500 పలుకుతోంది. కానీ నిమ్మ తోటలను తెగులు ఆశించడంతో దిగుబడి తగ్గింది. ఇప్పుడు రేటు పెరిగినా రైతులకు ప్రయోజనం ఉండడం లేదు.

ఉమ్మడి జిల్లాలో 30 వేల ఎకరాల్లో సాగు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూమారు 30 వేల ఎకారాల్లో నిమ్మ తోటలు సాగువుతున్నాయి. దాదాపు 20 వేల రైతు, కౌలుదారు కుటుంబాలు నిమ్మ తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు, మంచుతో పాటు చెట్లకు ఎర్ర తెగులు వ్యాపించాయి. దీంతో నిమ్మ చెట్లపైన పూత రాలిపోవడంతోపాటు పిందె కూడా లేకపోవడంతో దిగుబడులు తగ్గిపోయాయి. ఏటా మార్చి నుంచి మే వరకు నిమ్మకు మొదటి విడత మంచి సీజన్‌ ఆ తరువాత ఆగస్టు నుంచి అక్టోబర్‌ వరకు రెండో విడత సీజన్‌ ఉంటుంది. ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే నిమ్మ ధరలు పెరుగుతున్నప్పటికీ రైతులకు లాభం లేకుండా పోయింది.

ప్రసుత్తం మార్కెట్‌ వచ్చేది 5 వేల బస్తాలే..

రెండు నెలల క్రితం నకిరేకల్‌ మార్కెట్‌కు రోజూ 10 వేల నుంచి 15 వేల బస్తాల దిగుమతులు వచ్చేవి. అప్పట్లో బస్తా ధర రూ.500 నుంచి రూ.700 ధర పలికింది. ఇప్పుడు 5 వేల బస్తాలకు మించి నిమ్మ దిగుమతులు రావడం లేదు. ప్రస్తుతం బస్తా నిమ్మకాయల ధర రూ.2000 నుంచి రూ.2500 వరకు పలుకుతోంది. మార్కెట్‌లో నిమ్మకు మంచి ధర ఉన్నప్పటికీ దిగుబడులు రాకపోడంతో తోటలు సాగు చేసిన రైతులు దిగాలు చెందుతున్నారు. గతంలో ఒక్క చెట్టు నుంచి 3 నుంచి 4 బస్తాల దిగుబడులు రాగా.. ప్రస్తుతం ఒక్క బస్తాకు మించి రావడం లేదని నిమ్మ రైతులు వాపోతున్నారు.

వేసవి నేపథ్యంలో భారీగా పెరిగిన నిమ్మ ధర

ఫ వాతావరణం అనుకూలించక తగ్గిన దిగుబడులు

ఫ ధర పెరిగినా రైతులకు దక్కని ప్రయోజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement