దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకం | - | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకం

Mar 6 2026 8:04 AM | Updated on Mar 6 2026 8:04 AM

రామగిరి(నల్లగొండ) : భారతదేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకమని ఎంజీ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ మారం రమణారెడ్డి అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో శ్రీ50 సంవత్సరాలకు ముందుగా అత్యవసర పరిస్థితి – భారత ప్రజాస్వామ్యానికి పాఠాలుశ్రీ అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌ – 2026 కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యమన్నారు. ప్రిన్సిపాల్‌ సముద్రాల ఉపేందర్‌ మాట్లాడుతూ భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే యువత వినూత్న ఆలోచనలతో ముందు సాగాలన్నారు. కార్యక్రమంలో వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌ నోడల్‌ కో ఆర్డినేటర్‌ కోటయ్య, జ్యూరీ మెంబెర్స్‌ రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ భగవంత్‌రెడ్డి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శీలం యాదగిరి, సీనియర్‌ జర్నలిస్ట్‌ మంజుల చకిలం, కన్జ్యూమర్‌ ఫోరం అధ్యక్షుడు గురవయ్య, పర్యావరణ శాస్త్రవేత్త సురేష్‌ గుప్తా, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పరంగి రవికుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్స్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement