రోడ్డు ప్రమాదంలో పాస్టర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పాస్టర్‌ దుర్మరణం

Feb 24 2026 7:52 AM | Updated on Feb 24 2026 7:52 AM

రోడ్డు ప్రమాదంలో పాస్టర్‌ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో పాస్టర్‌ దుర్మరణం

కోదాడరూరల్‌ : విజయవాడ– హైదరాబాద్‌ జాతీయ రహదారిపై కోదాడ మండల పరిధిలోని దోరకుంట గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చర్చి పాస్టర్‌ మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కోదాడ రూరల్‌ ఎస్‌ఐ సీహెచ్‌. గోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని నయానగర్‌కు చెందిన ఉప్పెల్లి సత్యంబాబు(48) చర్చి పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం కారులో డ్రైవర్‌ తిరపయ్యను తీసుకొని చిమిర్యాల గ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో దోరకుంట గ్రామ శివారులోకి వెళ్లగానే.. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపు నుంచి వస్తున్న సత్యంబాబు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యంబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్‌ తిరపయ్యకు గాయాలుయ్యాయి. హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారులో ఉన్న సాయిదుర్గ, గాయత్రి, స్వప్న, మాధవి మురళీకృష్ణతో పాటు డ్రైవర్‌ నితీష్‌కు కూడా గాయాలు కావడంతో స్థానికులు వారిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య కాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరో ఆరుగురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement