మునగాల: రిటైర్డ్ ఉద్యోగులు సమాజసేవలో పాల్గొనాలని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి కోరారు. శనివారం మునగాల మండల కేంద్రంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మునగాల యూనిట్ ఆధ్వర్యంలో రూ.40లక్షల వ్యయంతో నిర్మించిన భవనాన్ని ఆయన రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మునగాల యూనిట్ అధ్యక్షుడు శాకమూడి అప్పారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఈనెల చివరి నాటికి ఈహెచ్‌ఎస్ కార్డులు ఇప్పించే బాధ్యత చేపడతానని హామీ ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని మంచి భావజాలాన్ని ప్రజల్లో కలిగించేందుకు నడుం బిగించాలని ఆకాంక్షించారు. మునగాలలో భవన నిర్మాణానికి రూ.10లక్షల విరాళాన్ని అందజేసిన విశ్రాంత ఉపాధ్యాయురాలు లక్ష్మి తులిసమ్మను అభినందించి పూలమాల, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ లింగయ్య, అసొసియేట్ ప్రెసిడెంట్ రావెళ్ల సీతరామయ్య, పత్రికా సంపాదకుడు శరత్‌బాబు, రాష్ట్ర సెక్రటరీ అక్కిరాజు లక్ష్మీనరసింహారావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొల్లు రాంబాబు, శ్యాంసుందర్ రెడ్డి, మండల బాధ్యులు, వివిధ మండలాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి


