ఖైదీల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఖైదీల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

Mar 11 2026 8:59 AM | Updated on Mar 11 2026 8:59 AM

చివ్వెంల(సూర్యాపేట) : ఖైదీల ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూర్యాపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్‌ కౌసర్‌ సూచించారు. మంగళవారం సూర్యాపేట సబ్‌ జైలును ఆమె సందర్శించారు. జైలు పరిసరాలు, మధ్యహ్న భోజనం, వంట గదులు, ఖైదీల గదులను పరిశీలించారు. ఖైదీలను ఆరోగ్యం విషయమై అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు సత్‌ప్రవర్తన కలిగి ఉండాలని, క్షణికావేశంలో చేసిన తప్పిదా ల వల్ల, కుటుంబాలకు దూరంగా జైలులో ఉండాల్సి వస్తుందని అన్నారు. న్యాయవాదులను పెట్టుకోలేని ఖైదీలు డీఎల్‌ఎస్‌ఏలో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆమె వెంట జైలు సూపరిండెంట్‌ సుధాకర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

ప్రగతి ప్రణాళికలో

భాగస్వాములు కావాలి

అర్వపల్లి : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నాగారం మండలం ఫణిగిరిలో మంగళవారం నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎర్ర సావిత్రియాదగిరి, పంచాయతీ కార్యదర్శి సురేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల నామినేషన్లు షురూ

చివ్వెంల(సూర్యాపేట) : ఈ నెల 26న జరుగునున్న బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. మొదటి రోజు ఐదు నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారి తోగటి మురళి తెలిపారు. అధ్యక్ష , ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాక్షుడు, గేమ్స్‌ అండ్‌ కల్చరల్‌, ఈసీ సభ్యుడు స్థానాలకు ఒక్కో నామినేషన్‌ వచ్చినట్లు పేర్కొన్నారు.

ఆధునిక సాంకేతికతపై రైతులను ప్రోత్సహించాలి

గరిడేపల్లి : సాగులో వస్తున్న నూతన సాంకేతిక అంశాలపై శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహించాలని దక్షిణ తెలంగాణ మండల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డాక్టర్‌ ఎల్‌. కృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో నిర్వహించిన శాసీ్త్రయ సలహా సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలన్నారు. కేవీకే సీనియర్‌ సైంటిస్ట్‌ అండ్‌ హెడ్‌ ఇన్‌చార్జి డి. నరేష్‌, సీహెచ్‌ నరేష్‌, కిరణ్‌, ఆదర్శ్‌, అక్షిత్‌సాయి, సుగంధి 2025–26 సంవత్సరంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో నాబార్డ్‌ డీడీఎం డి.రవీందర్‌, ప్రొఫెసర్‌ ఎన్‌.ప్రవీణ్‌, జిల్లా వ్యవసాయ అధికారి జి.శ్రీధర్‌రెడ్డి, కంపసాగర్‌ కేవీకే హెడ్‌ పి. చంద్రశేఖర్‌, ఉద్యాన అధికారి ఎం. మహేష్‌, మండల వ్యవసాయ అధికారి ప్రీతంకుమార్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement