పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి
సూర్యాపేట టౌన్ : పోలీస్ సిబ్బంది సంక్షేమానికి నిరంతరం కృషిచేస్తామని ఎస్పీ నరసింహ అన్నారు. కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన కృష్ణయ్య కుటుంబానికి ఆరోగ్య భద్రత ఇన్సూరెన్స్ కింద మంజూరైన నగదు చెక్కును గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేసి మాట్లాడారు. పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ఆరోగ్య భద్రత పథకం బాసటగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు రవీందర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, పోలీస్ సంఘం అధ్యక్షుడు రామచందర్‌గౌడ్, సంక్షేమ ఆర్‌ఎస్‌ఐ సాయిరాం, సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్తమ సేవలతో ప్రజల మన్ననలు పొందాలి
ఉద్యోగోన్నతి సాధించిన పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఎస్పీ నరసింహ అన్నారు. కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కె.విద్యాసాగర్‌కు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ నరసింహ ప్రమోషన్ ఉత్తర్వులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు.
ఫ ఎస్పీ నరసింహ


