వారం రోజులు అరైవ్‌– అలైవ్‌ | - | Sakshi
Sakshi News home page

వారం రోజులు అరైవ్‌– అలైవ్‌

Feb 23 2026 6:49 AM | Updated on Feb 23 2026 6:49 AM

వారం రోజులు అరైవ్‌– అలైవ్‌

వారం రోజులు అరైవ్‌– అలైవ్‌

రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన

ఎస్పీ నరసింహ

సూర్యాపేటటౌన్‌ : రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడేందుకు సోమవారం నుంచి జిల్లాలో వారం రోజుల పాటు రెండవ దశ అరైవ్‌–అలైవ్‌ (రోడ్డు భద్రత అవగాహన) కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యం చేరడం, ట్రాఫిక్‌ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ మేరకు సిబ్బందికి ఆదేశాలు, ప్రణాళిక జారీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తామని, ప్రజలకు ట్రాఫిక్‌ నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ద్విచక్రజు వాహనం నడిపే వారు హెల్మెట్‌ ధరించడం, కారు నడిపే వారు సీట్‌బెల్ట్‌ వినియోగం, వాహనాల మితిమీరిన వేగంతో నడ పకుండా ఉండడం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై ప్రతి రోజు ఒక కార్యక్రమం నిర్వహించి ప్రజలు, విద్యార్థులు, యువ కులతో పాటు వాహనాల డ్రైవర్‌లను చైతన్యవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

గోదావరి జలాల పునరుద్ధరణ

అర్వపల్లి : యాసంగి సీజన్‌కు వారబందీ విధానంద్వారా విడుదల చేస్తున్న గోదావరి జలాలను అధికారులు ఆదివారం రాత్రి పునరుద్ధరించారు. వారం రోజులపాటు నీళ్లు రానున్నాయి. ప్రస్తుతం 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ఇవి జిల్లాలోని 69,70,71 డిస్ట్రిబ్యూటరీలకు వెళ్తాయని జలవనరుల శాఖ ఈఈ ఎం.సత్యనారాయణగౌడ్‌, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్‌ తెలిపారు. జిల్లాలోని రైతులు సాగు నీటి పొదుపుగా వాడుకోవాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement