పాకిస్తాన్‌ జైలు నుంచి 216 మంది ఖైదీలు పరార్‌ | Over 200 Inmates Escape Pakistan Malir Jail After Earthquake, Know More Details Inside | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ జైలు నుంచి 216 మంది ఖైదీలు పరార్‌

Jun 4 2025 9:45 AM | Updated on Jun 4 2025 10:31 AM

Over 200 inmates escape Malir jail after earthquake

కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీలో మాలిర్‌ జైలు నుంచి 216 మంది ఖైదీలు తప్పించుకున్నారు. వీరిలో 80 మందిని తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. కరాచీ ప్రాంతంలో భూకంపం సంభవించడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

సోమవారం రాత్రి మాలిర్‌ జైలు నుంచి ఖైదీలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక ఖైదీ మరణించాడు. ముగ్గురు భద్రతా సిబ్బందితోపాట జైలు అధికారి ఒకరు గాయపడ్డారు. 

భూకంపం తర్వాత  జైలు బ్యారక్‌ల నుంచి 600 మందికిపైగా ఖైదీలను బయటకు తీసుకురాగా, 216 మంది పరారయ్యారు. 80 మందిని మళ్లీ అదుపులోకి తీసుకోగలిగారు. పరారీలో ఉన్న మిగతా ఖైదీల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇంకా 136 మందిని పట్టుకోవాల్సి ఉందని అధికారులు చెప్పారు. అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన మాలిర్‌ జైలులో మొత్తం 6,000 మంది ఖైదీలు ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement