
సాక్షి, చిత్తూరు జిల్లా: ‘ఏయ్.. ఎందుకు వీడియోలు తీస్తావ్.. పో.. చెప్పుకో పో.. నా విధులకు ఆటంకం కలిగిస్తే.. నీకు మెడికల్ సీటు రాదు.. జైలుకు పంపిస్తా. తమాషా అనుకుంటున్నావా’.. అంటూ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఎస్‌ఐ ఓ దివ్యాంగుడి కుమార్తెను బెదిరించారు. వివరాలివీ..
బంగారుపాళ్యం మండలం కరిడివారిపల్లికి చెందిన సుందరరాజు అనే దివ్యాంగుడుకి, హోంగార్డు కన్యాకుమార్ అనే వ్యక్తి మధ్య భూవివాదం తలెత్తింది. ఈ క్రమంలో పోలీసులు హోంగార్డుకు వత్తాసు పలుకుతున్నారని దివ్యాంగుడి కుమార్తె వాణి ఆగ్రహం వ్యక్తంచేసింది. పోలీసులు వచ్చే క్రమంలో వీడియో తీసింది. దీంతో ఎస్‌ఐ.. ‘ఏయ్ ఎందుకు వీడియోలు తీస్తున్నావ్..’ అంటూ వాణిని అడ్డుకోబోయారు.
ఎందుకు నా ఫోన్ లాక్కున్నారంటూ వాణి పోలీసులను ప్రశి్నంచింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాననడంతో.. ‘పో.. చెప్పుకో.. పో.. నా విధులకు ఆటంకం కలిగిస్తే నీకు మెడికల్ సీటు రాకుండా చేస్తా. జైలుకు పంపిస్తా. తమాషా చేస్తున్నావా’.. అంటూ ఆ యువతిపై ఎస్సై మండిపడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎస్‌ఐ తీరుపై వికలాంగుల సంఘాలు మండిపడుతున్నాయి.
