జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్! | Johny Master Released On Bail From Chanchalguda Jail Today | Sakshi
Sakshi News home page

Jani Master: 36 రోజుల తర్వాత జానీమాస్టర్ విడుదల!

Oct 25 2024 4:46 PM | Updated on Oct 25 2024 5:32 PM

Johny Master Released On Bail From Chanchalguda Jail Today

లైంగిక వేధింపుల కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్ ఇవాళ విడుదలయ్యారు. గురువారం ఆయనకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో చంచల్ గూడ జైలు నుంచి బయటకొచ్చారు.  దాదాపు 36 రోజులుగా జానీమాస్టర్ జైలులోనే ఉన్నారు.

కాగా.. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయిన అరెస్టైన విషయం తెలిసిందే. జానీ మాస్టర్‌ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి సెప్టెంబర్‌ 15న నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి కూడా చేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు జానీ మీద పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి.. గత నెల గోవాలో అరెస్టు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement