ఫర్లో తో డేరా బాబా బయటకు? | Ram Rahim Once Again Released from Sunaria Jail | Sakshi
Sakshi News home page

ఫర్లో తో డేరా బాబా బయటకు?

Aug 13 2024 11:22 AM | Updated on Aug 13 2024 1:19 PM

Ram Rahim Once Again Released from Sunaria Jail

హర్యానాలోని సునారియా జైలు నుంచి డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్(డేరా బాబా)కు 21 రోజుల పాటు ఫర్లో లభించింది. ఈ సమయంలో ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో గల బర్నావా ఆశ్రమంలో ఉండనున్నారు. రామ్ రహీమ్ తన ఇద్దరు అనుచరులపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.  

గత జనవరి 19న రామ్‌రహీమ్‌కు 50 రోజుల పెరోల్ లభించింది. ఈ దరిమిలా అతనికి పదేపదే పెరోల్ లేదా ఫర్లో లభించడంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ) దాఖలు చేసిన పిటిషన్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టు కొట్టివేసింది. కాంపిటెంట్ అథారిటీ నిబంధనల ఆధారంగా గుర్మీత్ రామ్ రహీమ్‌కు పెరోల్‌ లేదా ఫర్లో మంజూరు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని హర్యానా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణలో హర్యానా ప్రభుత్వం కేవలం రామ్ రహీమ్ మాత్రమే కాకుండా హత్య, అత్యాచారం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 80 మందికి పైగా ఖైదీలకు పెరోల్ లేదా ఫర్లో సౌకర్యం అందజేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఫర్లో అంటే ఏమిటి?
ఫర్లో అంటే ఎవరైనా ఖైదీ అతని కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు హాజరు కావడం లేదా అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుడిని పరామర్శించడం లాంటి నిర్దిష్ట ప్రయోజనం కోసం జైలు నుండి తాత్కాలికంగా విడుదల చేయడం. ఫర్లో సాధారణంగా స్వల్ప కాలానికి మాత్రమే ఇస్తారు. ఈ గడువు ముగిసిన తర్వాత, ఖైదీ తిరిగి జైలుకు వెళ్లవలసి ఉంటుంది. ఫర్లో షరతులను జైలు అధికారులు నిర్ణయిస్తారు. ఎవరైనా ఖైదీకి ఫర్లో మంజూరు చేసేటప్పుడు అధికారులు సదరు ఖైదీ చెప్పే కారణం, అతని ప్రవర్తన, అతను  తప్పించుకునే అవకాశం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.

పెరోల్‌ అంటే ఏమిటి?
పెరోల్ అంటే ఖైదీ తన జైలు శిక్షలో కొంత భాగాన్ని పూర్తి చేసిన చేసిన అనంతరం షరతులతో కూడిన విడుదలకు అనుమతి కల్పిస్తారు. ఇది ఖైదీ ప్రవర్తనను గుర్తించి ఇస్తారు. ఇది ఖైదీని సమాజంలో తిరిగి చేర్చేందుకు ఉపకరిస్తుంది. పెరోల్‌ సమయంలో ఖైదీ జైలు అధికారులు పర్యవేక్షణలో ఉంటాడు.  అలాగే నిర్ధిష్ట ప్రాంతంలో ఉంటూ, నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement