breaking news
Sunaria Jail
-
మళ్లీ జైలు బయటకు రామ్ రహీమ్..
రోహ్తక్: హర్యానాలోని రోహ్తక్లో గల హై-సెక్యూరిటీ సునారియా జైలు తలుపులు మరోసారి డేరా బాబా రామ్‌రహీమ్ కోసం తెరుచుకున్నాయి. అత్యాచారం, హత్య కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోమారు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ బయటకు వచ్చాడు. 2020 నుంచి ఇప్పటివరకు అతనికి లభించిన 17వ తాత్కాలిక విడుదల ఇది కావడం గమనార్హం.ఉదయాన్నే జైలు నుంచి విడుదలమంగళవారం (ఆగస్టు 25, 2026) తెల్లవారుజామున 6:05 గంటల ప్రాంతంలో గుర్మీత్ రామ్ రహీమ్ భారీ భద్రత నడుమ హర్యానాలోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చాడు. 21 రోజుల ఫర్లోపై విడుదలైన అతను నేరుగా సిర్సాలోని డేరా ప్రధాన కేంద్రానికి బయలుదేరాడు. 30 రోజుల పెరోల్ ముగించుకుని జూన్ 26న తిరిగి జైలుకు వెళ్లిన రామ్ రహీమ్, రెండు నెలలు గడవకముందే మళ్లీ పెరోల్ పొందడం చర్చనీయాంశమైంది.తీవ్రమైన నేరాలు.. జైలు శిక్షలుఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 2017 ఆగస్టులో రామ్ రహీమ్‌ను దోషిగా తేల్చి సునారియా జైలుకు తరలించారు. ఈ కేసులో అతనికి రెండు పదేళ్ల జైలు శిక్షలు వరుసగా అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. అనంతరం, బాబా నేర సామ్రాజ్యాన్ని బయటపెట్టిన సిర్సా పాత్రికేయుడు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో 2019లో అతనికి జీవిత ఖైదు పడింది.రంజిత్ సింగ్ హత్య కేసులో ఊరటడేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో కూడా గుర్మీత్ రామ్ రహీమ్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే, దర్యాప్తులో లోపాలు, బలహీనమైన సాక్ష్యాధారాల కారణంగా 2024లో పంజాబ్, హర్యానా హైకోర్టు రామ్ రహీమ్‌తో పాటు మరో నలుగురిని ఈ కేసు నుంచి నిర్దోషులుగా విడుదల చేసింది.చట్టం పరిధిలోనే విడుదలా?హర్యానా గుడ్ కండక్ట్ ప్రిజనర్స్ (టెంపరరీ రిలీజ్) యాక్ట్, 2022 ప్రకారం ఈ తాత్కాలిక విడుదలలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నిబంధనల ప్రకారం అర్హులైన ఖైదీలు సత్ప్రవర్తన కింద ఒక క్యాలెండర్ సంవత్సరంలో గరిష్టంగా 70 రోజుల పెరోల్, 21 రోజుల ఫర్లో పొందే వెసులుబాటు ఉంది.2020 నుంచి పెరోల్లలో..2020 అక్టోబర్‌లో మొదటిసారి ఒక రోజు పెరోల్ పొందిన రామ్ రహీమ్ ఆ తర్వాత క్రమం తప్పకుండా జైలు నుంచి బయటకు వస్తూనే ఉన్నాడు. 2021లో తల్లిని చూసేందుకు 12 గంటలు, 2022లో 21, 30, 40 రోజుల వ్యవధిలో మూడుసార్లు, 2023లో 40, 30, 21 రోజుల చొప్పున మూడుసార్లు బయటకు వచ్చాడు.గత మూడేళ్లలో..2024లో 50 రోజులు, 21 రోజులు, 20 రోజుల చొప్పున విడుదలై రికార్డు సృష్టించాడు. 2025లో జనవరిలో 30 రోజులు, ఏప్రిల్‌లో 21 రోజులు, ఆగస్టులో 40 రోజులు జైలు బయటే గడిపాడు. ప్రస్తుత 2026 సంవత్సరంలో జనవరిలో 40 రోజులు, మే నెలలో 30 రోజులు పెరోల్ పొందిన డేరా చీఫ్ ఇప్పుడు ఆగస్టులో 21 రోజుల పెరోల్తో 17వ సారి బయటకు వచ్చాడు. -
ఫర్లో తో డేరా బాబా బయటకు?
హర్యానాలోని సునారియా జైలు నుంచి డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్(డేరా బాబా)కు 21 రోజుల పాటు ఫర్లో లభించింది. ఈ సమయంలో ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో గల బర్నావా ఆశ్రమంలో ఉండనున్నారు. రామ్ రహీమ్ తన ఇద్దరు అనుచరులపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత జనవరి 19న రామ్‌రహీమ్‌కు 50 రోజుల పెరోల్ లభించింది. ఈ దరిమిలా అతనికి పదేపదే పెరోల్ లేదా ఫర్లో లభించడంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) దాఖలు చేసిన పిటిషన్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టు కొట్టివేసింది. కాంపిటెంట్ అథారిటీ నిబంధనల ఆధారంగా గుర్మీత్ రామ్ రహీమ్‌కు పెరోల్ లేదా ఫర్లో మంజూరు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని హర్యానా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణలో హర్యానా ప్రభుత్వం కేవలం రామ్ రహీమ్ మాత్రమే కాకుండా హత్య, అత్యాచారం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 80 మందికి పైగా ఖైదీలకు పెరోల్ లేదా ఫర్లో సౌకర్యం అందజేస్తున్నట్లు స్పష్టం చేసింది.ఫర్లో అంటే ఏమిటి?ఫర్లో అంటే ఎవరైనా ఖైదీ అతని కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు హాజరు కావడం లేదా అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుడిని పరామర్శించడం లాంటి నిర్దిష్ట ప్రయోజనం కోసం జైలు నుండి తాత్కాలికంగా విడుదల చేయడం. ఫర్లో సాధారణంగా స్వల్ప కాలానికి మాత్రమే ఇస్తారు. ఈ గడువు ముగిసిన తర్వాత, ఖైదీ తిరిగి జైలుకు వెళ్లవలసి ఉంటుంది. ఫర్లో షరతులను జైలు అధికారులు నిర్ణయిస్తారు. ఎవరైనా ఖైదీకి ఫర్లో మంజూరు చేసేటప్పుడు అధికారులు సదరు ఖైదీ చెప్పే కారణం, అతని ప్రవర్తన, అతను తప్పించుకునే అవకాశం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.పెరోల్ అంటే ఏమిటి?పెరోల్ అంటే ఖైదీ తన జైలు శిక్షలో కొంత భాగాన్ని పూర్తి చేసిన చేసిన అనంతరం షరతులతో కూడిన విడుదలకు అనుమతి కల్పిస్తారు. ఇది ఖైదీ ప్రవర్తనను గుర్తించి ఇస్తారు. ఇది ఖైదీని సమాజంలో తిరిగి చేర్చేందుకు ఉపకరిస్తుంది. పెరోల్ సమయంలో ఖైదీ జైలు అధికారులు పర్యవేక్షణలో ఉంటాడు. అలాగే నిర్ధిష్ట ప్రాంతంలో ఉంటూ, నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. -
కనిపిస్తే కాల్చివేత.. రూమర్లు నమ్మొద్దు
రోహ్టక్:రేప్ కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు నేడు శిక్షలు ఖరారు కానున్న నేపథ్యంలో పంచకుల, సిస్రా తరహా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హర్యానా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు రోహ్టక్ జిల్లా కలెక్టర్ అతుల్ కుమార్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఉన్నత స్థాయి భేటీ అనంతరం ఈ నిర్ణయం వెల్లడించారు. ‘రోహ్టక్లో ఎవరైనా సరే శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే ముందు హెచ్చరిక జారీ చేస్తాం. అయినా కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఎవరికైనా హని తలపెట్టినా, ఆత్మహత్యాయత్నం లాంటివి చేసినా కాల్చివేయటం జరుగుతుంది. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాం’ అని అతుల్ తెలిపారు. హైకోర్టు సూచనల మేరకే తాము నడుచుకుంటామని ఆయన అన్నారు. ఇక గుర్మీత్ ఉన్న సునారియ జైలు చుట్టుపక్కల మొత్తం 23 పారామిలటరీ భద్రత దళాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అతుల్ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు కూడా బయటికి రావొద్దని, మీడియాకు కూడా పలు సూచనలు చేశామని ఆయన చెప్పారు. హెలికాఫ్టర్ ద్వారా న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ జైలుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నాం 2 గంటల 30 నిమిషాల సమయంలో తీర్పు వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఆ వార్త నిజం కాదు: ఢిల్లీ పోలీసు శాఖ న్యూఢిల్లీ: రామ్ రహీమ్ సింగ్ శిక్ష ఖరారు నేపథ్యంలో ఢిల్లీలో అలర్ట్ ప్రకటించిన విషయాన్ని ఢిల్లీ పోలీస్ శాఖ ఖండించింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారని, ట్రాఫిక్‌ను దారి మళ్లీంచారని వాట్సాప్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ పీఆర్వో మధుర్ వర్మ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలంతా ఉత్తవేనని మధుర్ తేల్చేశారు. అయితే అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం మాత్రం చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక మీడియాపై దాడుల నేపథ్యంలో వారికి పోలీసులతో రక్షణ కల్పించినట్లు మధుర్ తెలిపారు.


