కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ | Massive Encounter In Karregutta Forest, Top Maoist Leaders Killed During Operation Kagar, More Details Inside | Sakshi
Sakshi News home page

కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌

Feb 19 2026 11:49 AM | Updated on Feb 19 2026 1:15 PM

Few Maoist Died In Karregutta Encounter

రాయ్‌పూర్‌ : తెలంగాణ–ఛత్తీస్‌గడ్ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.  వీరిలో అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది.  ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా, అందులో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం.  మృతిచెందిన వారిలో అగ్రనేత దేవ్‌జీ  ఉన్నట్లు తెలుస్తోంది.

కర్రెగుట్టలో ఆపరేషన్‌-2లో భాగంగా 5 వేల మంది సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కూంబింగ్‌ చేపట్టారు. మావోయిస్ట్‌ అగ్రనేతలే టార్గెట్‌గా ఆపరేషన్‌-2 కగార్‌ సాగుతోంది. మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, సోది కోసం కూంబింగ్ చేపట్టగా.. మరో వైపు లొంగుబాటుకు అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. ఇంకా 40 రోజులే ఆపరేషన్‌ కగార్‌ డెడ్‌లైన్‌ మిగిలి ఉంది.

దీంతో కేంద్ర హోంశాఖ మావోయిస్టుల కార్యకలాపాలపై మరింత దృష్టి సారిస్తోంది. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సైతం ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీలో ఇంకా కీలకంగా వ్యవహరిస్తున్న నేతల వివరాలపై ఆరా తీస్తోంది. ఆపరేషన్‌ కగార్‌ను 2024 జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ అడవులు, మహారాష్ట్ర, ఒడిశా వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది పలువురు కీలక నేతలతో పాటు వందలాది మావోయిస్టులు ఎదురుదాడుల్లో మృతిచెందారు. రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌ అగ్రనేత మోస్ట్‌ వాంటెడ్‌, గెరిల్లా దాడుల వ్యూహకర్త మడివి హిడ్మా కూడా మృతి చెందారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకునే కగార్‌-1, కగార్‌-2 ఆపరేషన్‌లను మరింత ఉధృతం చేసింది కేంద్ర ప్రభుత్వం.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement