జైలులో బీడీలు, గుట్కా ఇవ్వాలని ఖైదీల డిమాండు | Protests By Prisoners In Kalaburagi Jail Demanding Beedis And Gutka, More Details Inside | Sakshi
Sakshi News home page

జైలులో బీడీలు, గుట్కా ఇవ్వాలని ఖైదీల డిమాండు

Nov 28 2024 11:50 AM | Updated on Nov 28 2024 11:59 AM

Massive Protest In Kalaburagi Jail Demanding Beedi And Gutka

దొడ్డబళ్లాపురం: బీడీలు, గుట్కా ఇవ్వాలని డిమాండు చేస్తూ కలబుర్గి జైలులో ఖైదీలు ధర్నా చేశారు. ఇటీవల జైలులో అన్నీ నిలిపివేసారని ముస్తఫా అనే ఖైదీ ఆధ్వర్యంలో సుమారు 70 మంది ధర్నా చేసినట్లు తెలిసింది. కొత్తగా వచ్చిన జైలు అధికారి అనిత లంచం అడిగారని ముస్తఫా ఒక మహిళ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు ఇప్పించాడు. 

డబ్బులు ఇస్తేనే పొగాకు, గుట్కాలను అనుమతిస్తానని ఆమె స్పష్టం చేసిందన్నారు. అతడు, మిగతా ఖైదీలు తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని జైలర్‌ అనిత సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు సోదరితో మాట్లాడిన ఆడియోలో తనకు బెదిరింపులు ఉన్నాయని అనిత చెబుతున్నారు. గుట్కా తదితరాలను అడ్డుకోవడంతో తనపై కక్ష గట్టారని ఆమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement