రోజూ రోటీయేనా ? | Sanjoy Roy demands egg chowmein in jail, Accused demands | Sakshi
Sakshi News home page

రోజూ రోటీయేనా ?

Sep 1 2024 6:37 AM | Updated on Sep 1 2024 6:37 AM

Sanjoy Roy demands egg chowmein in jail, Accused demands

కోడిగుడ్డు చావ్‌మీన్‌ పెట్టండి

జైల్లో జూనియర్‌ వైద్యురాలి రేప్‌ కేసు నిందితుడు సంజయ్‌ రాయ్‌ డిమాండ్‌

కోల్‌కతా: దేశమంతటా కలకలం సృష్టించిన కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలి హత్యోదంతంలో నిందితుడు సంజయ్‌ రాయ్‌ జైళ్లోనూ తన మొండితనం చూపిస్తున్నాడు. ప్రతి రోజూ చపాతి ఏం తింటామని జైలు అధికారులపైనే ఆగ్రహం వ్యక్తంచేశాడు. అయితే జైలు నిబంధనల ప్రకారం ఖైదీలతోపాటే విచారణ ఖైదీలకు ఒకేరకమైన భోజనం వడ్డిస్తారు.

 వైద్యురాలి హత్యకేసులో అరెస్ట్‌చేశాక పోలీసులు సంజయ్‌ను కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కారాగారంలో పడేశారు. అయితే కస్టడీలో ఉన్నప్పటి నుంచి ఒకే తరహా చపాతి, కూరనే రోజూ వడ్డిస్తున్నారని సంజయ్‌ ఆగ్రహంగా మాట్లాడారు. ‘‘ రోజూ రోటీయేనా?. నాకు కోడిగుడ్డు ఫ్రైడ్‌రైస్‌లాంటి ఎగ్‌ చావ్‌మీన్‌ పెట్టండి’ అని జైలు సిబ్బందిని బెదిరించినట్లు విశ్వస నీయ వర్గాల సమా చారం.

 అయితే విచారణ ఖైదీ తనకిష్టమొచ్చింది తింటానని తెగేసి చెప్పడంపై జైలు యాజమాన్యం సీరియస్‌ అయింది. అతి చేయొద్దని హెచ్చరించి అధికారులు సంజయ్‌ నోరు మూయించారు. దీంతో పెట్టింది తింటానని సంజయ్‌  వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే జైలుకు వచ్చిన కొత్తలో తనకు నిద్ర పట్టట్లేదని, నిద్ర సరిపోవడం లేదని, నన్ను కాస్తంత పడుకోనివ్వండి అని సంజయ్‌ తెగ ఫిర్యాదులు చేసేవాడని ఇప్పుడు  సాధారణ స్థాయికి వచ్చాడని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement