
చోరీ కేసుల్లో అరెస్టై సంగారెడ్డి కారాగారాంలో ఉన్న ఇద్దరు ఖైదీలు.. మేకులు,బ్యాటరీలు మింగి హల్‌చల్ చేసిన ఉదంతం ఇది. వివరాల్లోకి వెళితే.. చోరీ కేసులో జైలుకొచ్చిన ఛావుస్,మధు ట్రబుల్ మేకర్లుగా ఉన్నారు. రెండురోజుల క్రితం అందుబాటులో ఉన్న మేకులు, టీవీరిమోట్‌కు ఉండే బ్యాటరీలు మింగి గుడ్లు తేలేశారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పతత్రికి తరలించారు.
ఇద్దరూ రెండ్రోజులుగా వైద్యానికి సహకరించడం లేదని దగ్గరకు వచ్చేవారిపై ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వారి కడుపులో ఉన్న బ్యాటరీలు,మేకులను శస్త్ర చికిత్స ద్వారా తొలగించాలని లేదంటే సెప్టిక్ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు.
కడుపులో ఉంటే బ్యాటరీలు పగిలితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆస్పత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై జైలు సూపరిటెండెంట్ కళాసాగర్‌ను వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించగా ఆయన ఫోన్‌లో అందుబాటులో లేరు.