హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ ఫైనల్స్‌ | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ ఫైనల్స్‌

Feb 16 2026 7:37 AM | Updated on Feb 16 2026 7:37 AM

హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ ఫైనల్స్‌

హోరాహోరీగా బ్యాడ్మింటన్‌ ఫైనల్స్‌

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాకినాడ..

40 ప్లస్‌ మెన్స్‌లో విశాఖ..

మెన్స్‌ డబుల్స్‌లో హైదరాబాద్‌ విజేతలు

ముగిసిన ఉభయ రాష్ట్రాల స్థాయి టోర్నీ

అమలాపురం టౌన్‌: అమలాపురం ఆఫీసర్స్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ ఇన్‌డోర్‌ స్టేడియంలో శని, ఆదివారాల్లో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ఫైనల్స్‌ హోరాహోరీగా జరిగాయి. అమలాపురానికి చెందిన స్పోర్ట్స్‌ లెజెండ్‌ దివంగత రంకిరెడ్డి కాశీ విశ్వనాథం పేరిట ఆయన కుమారులు అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్‌ సాయిరాజ్‌, చరణ్‌ తేజ (సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌) స్పోర్ట్స్‌ కాశీ అకాడమి ద్వారా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. పోటీలలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 85 జట్లు పాల్గొన్నాయి. మెన్స్‌ డబుల్‌, మిక్స్‌డ్‌ డబుల్‌, మెన్స్‌ 40 ప్లస్‌ డబుల్స్‌ విభాగాల్లో పోటీలు జరిగాయి. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో మిక్స్‌డ్‌ డబుల్‌ విభాగంలో కాకినాడకు చెందిన కె.సాయికర్‌, కె.సరయు ప్రధమ, అమలాపురానికి చెందిన టి.సాయి హర్షిణి, వై.గౌతమ్‌ ద్వితీయ, కాకినాడకు చెందిన పి.చంద్ర గోపీనాథ్‌, ఎం.వీరదుర్గ తృతీయ స్థానాల్లో గెలుపొందారు. 40 ప్లస్‌ మెన్స్‌ డబుల్‌ విభాగంలో విశాఖకు చెందిన ఉదయ భాస్కర్‌, జానీ ప్రధమ, గుంటూరుకు చెందిన జితేందర్‌, ఖాదర్‌ మస్తాన్‌ ద్వితీయ, విజయవాడకు చెందిన డి.సునీల్‌ కుమార్‌, ఎస్‌.రమేష్‌ తృతీయ స్థానాలు సాధించారు. మెన్స్‌ డబుల్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన పి.చంద్ర గోపీనాథ్‌, విఘ్నేష్‌ ప్రధమ, విజయవాడకు చెందిన కె.శ్రీకర్‌, బి.అభిషేక్‌ ద్వితీయ, ముంబైకి చెందిన హర్షిత్‌, గర్వ్‌ తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నారు. విజేతలకు రూ.1.50 లక్షల నగదు బహుమతులు అందజేశారు. పోటీలు శనివారం ఉదయం ప్రారంభమై ఆదివారం రాత్రితో ముగిశాయి. విజేతలకు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌, చరణ్‌ తేజ, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అల్లాడ శరత్‌బాబు, కోనసీమ షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యదర్శి యాళ్ల నాగ సతీష్‌, ఆఫీసర్స్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ ప్రతినిధులు తిక్కిరెడ్డి శ్రీనివాసరావు, కల్వకొలను బాబు, తిక్కిరెడ్డి సురేష్‌ తదితరులు నగదు బహుమతులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement