● పెంట కాలువే..
ఎటు చూసినా, ప్లాస్టిక్ వ్యర్థాలు జంతు కళేబరాలు చూసి పెంట కాలువ అనుకుంటే పొరపాటే.. ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో గొరగొనమూడి, కూనవరం టైల్ ఎండ్ పంట కాలువ దుస్థితి ఇది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగుకు నీరు అందించాల్సిన కాలువ ఇలా అధ్వానంగా తయారైంది. నిండా చెత్తా చెదారం, వ్యర్థాలతో మూసుకుపోయింది. సన్నవిల్లి పంచాయతీ పరిధి దుర్గమ్మ గుడి సమీపంలో ఇలా ఉండడంతో దుర్వాసన భరించలేకపోతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. –ఉప్పలగుప్తం


