పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై రాకపోకలు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై రాకపోకలు బంద్‌

Feb 8 2026 4:15 AM | Updated on Feb 8 2026 4:15 AM

పి.గన

పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై రాకపోకలు బంద్‌

ఈ నెల 10 నుంచి 40 రోజుల పాటు మరమ్మతులు

పాత అక్విడెక్టుపై చిన్న వాహనాలకు మాత్రమే అనుమతి

పి.గన్నవరం: సీఎస్‌ఆర్‌ నిధులు రూ.49.3 లక్షలతో పి.గన్నవరం కొత్త అక్విడెక్టు రోడ్డుకు ఈ నెల 10 నుంచి మరమ్మతులు నిర్వహించేందుకు ఇరిగేషన్‌ అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో 10వ తేదీ నుంచి 40 రోజుల పాటు కొత్త అక్విడెక్టుపై రాకపోకలు నిలిపి వేస్తున్నారు. పాత అక్విడెక్టు మీదుగా చిన్న వాహనాలు, మోటారు సైకిళ్ల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ విషయాన్ని ఇరిగేషన్‌ డీఈఈ భూపతిరాజు ప్రసాద్‌రాజు శనివారం రాత్రి అమలాపురంలో కలెక్టర్‌ కార్యాలయానికి తెలియజేశారు.

జాయింట్లు దెబ్బతిని..

కొత్త అక్విడెక్టు రోడ్డుపై పిల్లర్ల మధ్య ఎక్పేన్సన్‌ జాయింట్లు దెబ్బతినడంతో గోతులు ఏర్పడి ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో రూ.49.03 లక్షలతో 34 జాయింట్ల వద్ద స్ట్రిప్‌ సీల్‌ ఏర్పాటు చేసి, కాంక్రీట్‌తో వేరింగ్‌ కోట్‌ వేయడం, దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. వీటిని పూర్తి చేసేందుకు 20 రోజులు, అనంతరం వాటర్‌ క్యూరింగ్‌కు 20 రోజులు పడుతుందని అంచనా వేశారు. మరమ్మతులకు మెటీరియల్‌ను సిద్ధం చేశారు. దీంతో 40 రోజుల పాటు పాత అక్విడెక్టు మీదుగా రాజోలు దీవిలోకి చిన్న వాహనాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలకు అనుమతి లేదు. అక్విడెక్టు మీదుగా ప్రయాణించే భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి.

దెబ్బతిన్న జాయింట్లు

పి.గన్నవరం కొత్త అక్విడెక్టు

పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై రాకపోకలు బంద్‌1
1/1

పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై రాకపోకలు బంద్‌

Advertisement
 
Advertisement
Advertisement