బాలాజీ స్వామికి రూ.2.92 లక్షల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

బాలాజీ స్వామికి రూ.2.92 లక్షల ఆదాయం

Feb 9 2026 7:49 AM | Updated on Feb 9 2026 7:49 AM

బాలాజ

బాలాజీ స్వామికి రూ.2.92 లక్షల ఆదాయం

మామిడికుదురు: మాఘ మాసం ఆదివారాన్ని పురస్కరించుకుని అప్పనపల్లి బాల బాలాజీ స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.2,92,990 ఆదాయం వచ్చిందని ఈఓ వి.రాంబాబురెడ్డి తెలిపారు. స్వామి వారిని 5,300 మంది భక్తులు దర్శించుకున్నారని, 2,600 మంది అన్న ప్రసాదం స్వీకరించారని ఆయన తెలిపారు. నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.1,03,371 విరాళాలుగా అందించారన్నారు. ఆత్రేయపురానికి చెందిన అద్దేపల్లి వెంకటేశ్వరరావు, మాణిక్యాంబ దంపతులు రూ.10,116 విరాళాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణికి అందజేశారని, దాత కుటుంబ సభ్యులకు ఆయన స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. నడిపూడికి చెందిన కుడుపూడి బాలయోగి, కుటుంబ సభ్యులు స్వామి వారి సన్నిధిలోని గోవులకు ట్రాక్టర్‌ ఎండుగడ్డిని ఉచితంగా సమర్పించారు.

ఉచిత అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

ముమ్మిడివరం: ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఉచిత అడ్మిషన్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ కలెక్టర్‌, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ జి.మమ్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌టీఈ 12(1)సీ చట్టం ప్రకారం పేద, వెనుకబడిన వర్గాల చిన్నారులకు ఒకటో తరగతిలో ఉచితంగా అడ్మిషన్లు కల్పిస్తారని ఆమె తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఉచితంగా అడ్మిషన్ల కోసం 25 శాతం సీట్లు కేటాయించినట్టు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు నివాస ప్రాంతం సమీపంలో ఉన్న ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలకు ఆన్‌లైన్‌లో నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెబ్‌సైట్‌లో ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి పదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. మార్చి 25 నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీ విధానంలో మొదటి విడతగా సీట్లు కేటాయిస్తారన్నారు. వివరాలకు 1804258599 టోల్‌ ఫ్రీ నంబరుకు సంప్రదించవచ్చునని మమ్మీ తెలిపారు.

పర్ణం.. విచిత్ర వర్ణం!

రాయవరం: పల్లె సీమలు ప్రకృతి అందాలకు నిలయాలు. చెట్టు, పుట్ట, గట్టు ఏదైనా వివిధ ఆకృతుల్లో అలరిస్తూ, ఆహ్లాదాన్ని పంచుతాయి. చూసే వారికి కనువిందు చేస్తాయి. అటువంటి దృశ్యమే రాయవరం మండలం సోమేశ్వరం సమీపంలో రహదారి పక్కన కనువిందు చేస్తోంది. మామిడి చెట్టు మూడు రంగుల్లో ఆకట్టుకుంది. లేలేత మావి చిగురులు ఎరుపు వర్ణంలో, ముదురు ఆకులు పచ్చగా.. కొమ్మలు లేత పచ్చగా వివిధ రంగుల్లో చూపరులను ఆకట్టుకుంటోంది.

నెమలికోన @ 8 వేలు

సఖినేటిపల్లి: పల్లిపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ కేంద్రంగా సముద్రంపై వేటకు వెళ్లిన మత్య్సకారుల పంట పండింది. శనివారం సాయంత్రం వేటకు వెళ్లిన వారు ఆదివారం మత్స్య సంపదతో తిరిగి వచ్చారు. ఇతర సంపదతో పాటు నెమలికోన రకం చేపలు వలకు చిక్కాయి. ఇందులో భారీ నెమలికోన చేపను కొనుగోలుదారుడు రూ.8 వేలకు దక్కించుకున్నాడు. ఈ రకం చేపలకు చైన్నె, కేరళ రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉండడంతో అక్కడికి ఎగుమతి చేస్తున్నారు.

బాలాజీ స్వామికి రూ.2.92 లక్షల ఆదాయం  1
1/2

బాలాజీ స్వామికి రూ.2.92 లక్షల ఆదాయం

బాలాజీ స్వామికి రూ.2.92 లక్షల ఆదాయం  2
2/2

బాలాజీ స్వామికి రూ.2.92 లక్షల ఆదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement