ఎమ్మెల్సీ తోటకు మాజీ సీఎం జగన్‌ పరామర్శ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ తోటకు మాజీ సీఎం జగన్‌ పరామర్శ

Feb 9 2026 7:49 AM | Updated on Feb 9 2026 7:49 AM

ఎమ్మె

ఎమ్మెల్సీ తోటకు మాజీ సీఎం జగన్‌ పరామర్శ

రామచంద్రపురం: మండపేట నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఫోన్‌లో పరామర్శించారు. త్రిమూర్తులు సోదరుడు తోట సత్యనారాయణ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను జగన్‌, ఎంపీ మిథున్‌రెడ్డి ఫోన్‌ చేసి వివరాలను తెలుసుకుని పరామర్శించారు. అలాగే త్రిమూర్తులును పలువురు జిల్లా, రాష్ట్ర నాయకులు వెంకటాయపాలెంలోని ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాల్‌, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, టీడీపీ నేతలు పప్పుల మసేను వెంకన్న (రేవు శ్రీను), మాజీ ఏఎంసీ చైర్మన్‌ కొమరిన వీర్రాజు, మాజీ ఎంపీపీ యాళ్ల కృష్ణారావు, కొప్పిశెట్టి తాతాయిలు, రామచంద్రపురం మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పరామర్శించారు. వారు సత్యనారాయణ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎమ్మెల్సీ తోటకు మాజీ సీఎం జగన్‌ పరామర్శ 1
1/1

ఎమ్మెల్సీ తోటకు మాజీ సీఎం జగన్‌ పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement