సామాన్య భక్తులకు ప్రాధాన్యం
● దేవదాయశాఖ డీసీ రమేష్‌బాబు
● వీరేశ్వరస్వామి ఆలయంలో
శివరాత్రి ఏర్పాట్ల పరిశీలన
ఐ.పోలవరం: మహా శివరాత్రి ఉత్సవాలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ డి.ఎల్.వి రమేష్‌బాబు అన్నారు. మురమళ్ల శ్రీ వీరేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరగబోయే మహా శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు గురువారం పరిశీలించారు. భక్తులు రద్దీ, క్యూ విధానం, కార్యక్రమ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కాకినాడ జోన్ పరిధిలో ఉన్న 7 జిల్లాల్లో 42 ముఖ్య ఆలయాలకు శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అధికారులను నియమించి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామన్నారు. మురమళ్ల ఆలయానికి సుమారు 30 వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసినట్టు ఏసీ వి.సత్యనారాయణ వివరించారు. శీఘ్ర, ఉచిత దర్శనం ఏర్పాటు చేశామన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు పాల్గొన్నారు.
భీమేశ్వరుని హుండీల
ఆదాయం రూ. 27.46 లక్షలు
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ హుండీల ఆదాయం రూ. 27,46,616 వచ్చినట్లు ఈఓ, దేవదాయ శాఖ ఏసీ అల్లు వెంకట దుర్గాభవాని గురువారం విలేకరులకు తెలిపారు. గత ఏడాది నవంబర్ 27వ తేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆలయ హుండీల నుంచి రూ.26,59,090, అన్నదానం హుండీల నుంచి రూ.87,526 వచ్చినట్లు పేర్కొన్నారు. ఈఓతో పాటు అంగర గ్రూపు టెంపుల్స్ ఈఓ ఎం.శ్రీదేవి, ఓదూరు గ్రూపు టెంపుల్స్ ఈఓ విత్తనాల శ్రీనివాస్, కె.గంగవరం గ్రూపు టెంపుల్స్ ఈఓ వి.బాలకృష్ణల పర్యవేక్షణలో లెక్కింపు సాగింది. ద్రాక్షారామ పీఏసీఎస్ చైర్మన్ ముప్పనపల్లి గణేష్, గ్రామ పెద్దలు దవులూరి రామకృష్ణ, అల్లం రామకృష్ణ, ఆళ్ల బుజ్జి, సలాది శ్రీను పాల్గొన్నారు. ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
క్వాయర్ పరిశ్రమలతో
మహిళలకు ఉపాధి
అమలాపురం రూరల్: క్వాయర్ పరిశ్రమల స్థాపన ద్వారా మహిళలకు ఉపాధి కల్పన సాధ్యమవుతుందని, ఆ దిశగా ఉప్పలగుప్తంలో పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వెల్లిడించారు. క్వాయర్ బోర్డు, కేరళ కొచ్చి కేంద్ర క్వాయర్ పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్తలు గిరీష్ కుమార్, సుమీ సబాస్తియన్ వివేక్ ప్రసాద్ షా, జిల్లా ఉద్యాన అధికారి బివి రమణతో కలెక్టర్ అధ్యక్షతన గురువారం ఉత్పత్తుల తయారీ, ఎగుమతుల ప్రోత్సాహకం వంటి అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లా డుతూ ఉప్పలగుపుంలోరూజ 13.5 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.


