చంద్రబాబూ దేవుళ్లతో ఆడుకోవద్దు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ దేవుళ్లతో ఆడుకోవద్దు

Feb 13 2026 3:49 AM | Updated on Feb 13 2026 3:49 AM

చంద్రబాబూ దేవుళ్లతో ఆడుకోవద్దు

చంద్రబాబూ దేవుళ్లతో ఆడుకోవద్దు

మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు

మలికిపురంలో నిరసన ప్రదర్శన

మలికిపురం: రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుళ్లతో ఆడుకోవద్దని, ప్రజలు క్షమించరని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. తనకు అనుకూలంగా అబద్దాలను ప్రచారం చేయడం, తిమ్మిని బమ్మిని చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ, ల్యాబ్‌లు నిర్ధారించినా టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ గురువారం మలికిపురంలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ తమ తప్పిదాలను కప్పి పుచ్చుకోవడం కోసం చంద్రబాబు ఎన్ని దారుణాలకై నా తెగబడతాడని అన్నారు. లడ్డూలో కల్తీ జరగ లేదని కూటమి ఎమ్మెల్యేలు, ప్రొఫెసర్లు చెబుతున్నా వారిని సైతం బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏకంగా తిరుపతి ఆలయ ప్రతిష్టనే వాడుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆయనను క్షమించరని సూర్యారావు అన్నారు. తిరుపతికి అపచారం తలపెట్టిన కూటమి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ప్రజలు ఎక్కడ అడుగుతారోనని డైవర్షన్‌ రాజకీయాలకు పాల్పడుతూ, తప్పుడు కేసులతో వైఎస్సార్‌ సీపీ నేతలను భయపెట్టి, పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే ప్రజలు తిరగబడతారని అన్నారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శులు పాటి శివకుమార్‌, కటకంశెట్టి ఆదిత్యకుమార్‌, సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చిన్న రాజా, బీసీ విభాగం రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ గుబ్బల మనోహర్‌, విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తాడి సహదేవ్‌, మండల పార్టీ అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్‌, రాష్ట్ర జిల్లా నాయకులు ఇందుకూరి పిప్పరరాజు, కూనపరెడ్డి రాంబాబు, మోకా సురేష్‌, కొల్లాబత్తుల మున్నా, సతీష్‌బాబు, దొంగ నాగ సత్యనారాయణ, గుబ్బల రోజా రమణి, ఉచ్చుల దాసు, చెల్లుబోయిన బుచ్చియ్య మాస్టారు, గుబ్బల వి.వి.సత్యనారాయణ, గుబ్బల సింహాచలం, యాండ్ర రాంబాబు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement