క్యాన్సర్ లక్షణాలను ప్రాథమిక దశలో గుర్తించాలి
అమలాపురం టౌన్: కేన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు వీలుగా గురువారం నుంచి శనివారం వరకూ మూడు రోజులపాటు జిల్లాలోని అన్ని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు, నివారణకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ ఎం.దుర్గారావు దొర తెలిపారు. జిల్లాలోని ఫ్రంట్ లైన్ ఆర్యోగ సిబ్బందికి ఈ టెస్ట్‌లు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. తొలుత ప్రభుత్వ ఏరియా ఆస్పతి ప్రాంగణంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ఆరోగ్య సిబ్బందికి స్క్రీనింగ్ టెస్ట్‌లు చేశారు. డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ భరతలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకరరావు, డాక్టర్ అనూష పాల్గొన్నారు.


