కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలి

Feb 4 2026 7:05 AM | Updated on Feb 4 2026 7:05 AM

కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలి

కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలి

అమలాపురం టౌన్‌: తిరుమల తిరుపతి లడ్డూపై అసత్య ఆరోపణలు చేసి కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచిన బాధ్యులైన కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్థానిక పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, లోక్‌ష్‌లే కాకుండా కూటమి నాయకులు చేసిన వ్యాఖ్యలు అవాస్తమని సీబీఐ సిట్‌ నివేదిక ద్వారా తేలిపోయినా ఇంకా బొంకు తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్‌, కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) తదితరులు పట్టణ సీఐ పి.వీరబాబుకు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌లపై జరిగిన ఆటవిక దాడులను నిరసిస్తూ తొలుత పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు ఎదురుగా గడియారం స్తంభం సెంటరులో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పార్టీ ఎమ్మెల్సీలు, పార్టీ కో ఆర్డినేటర్‌, పార్టీ నాయకులు వినతి పత్రం అందించారు. పార్టీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌, ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌ మాట్లాడుతూ తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వం కుట్ర బయట పడిందని చెప్పిన మాజీ మంత్రులు రాంబాబు, రమేష్‌లపైన, వారి ఇళ్లపైన కూటమి నాయకుల చేసిన దాడులు, దమనకాండ దారుణమని పేర్కొన్నారు. తక్షణమే ఈ ప్రభుత్వాన్ని బర్త్‌ రఫ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌లు ఉసిగొల్పడం వల్లే కూటమి నాయకులు మాజీ మంత్రులపై హత్యాయత్నాలకు ప్రయత్నించారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌ రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉండి కూడా తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ పదే పదే మీడియా సమావేశాల్లో వైఎస్సార్‌ సీపీ పైన, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైన బురద జల్లుతున్నారన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్రమణి, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామ్‌గోపాల్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్‌ భూషణ్‌, పార్టీ జిల్లా అనుబంధ కమిటీల అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, జాన గణేష్‌, అమలాపురం పట్టణం, రూరల్‌ మండల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, గుత్తుల చిరంజీవిరావు, పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల నాయకులు చొల్లంగి సుబ్బిరామ్‌, సరెళ్ల రామకృష్ణ, చీకట్ల కిషోర్‌, సూదా గణపతి, విత్తనాల మూర్తి, పొగాకు శ్రీను, ములపర్తి శ్రీను, దూడల ఫణి, ఈతకోట శ్రావణ్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు చిట్టూరి పెదబాబు, కట్టోజు సన్నయ్యదాసు, కొల్లాటి దుర్గాబాయి పాల్గొన్నారు.

తిరుమల లడ్డూపై భక్తుల

మనోభావాలను గాయపరిచారు

అమలాపురం వైఎస్సార్‌ సీపీ

కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌,

ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు,

ఇజ్రాయిల్‌ డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement