రాష్ట్రంలో రాజ్యాంగ పాలన పూర్తిగా విఫలం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రాజ్యాంగ పాలన పూర్తిగా విఫలం

Feb 4 2026 7:05 AM | Updated on Feb 4 2026 7:05 AM

రాష్ట్రంలో రాజ్యాంగ పాలన పూర్తిగా విఫలం

రాష్ట్రంలో రాజ్యాంగ పాలన పూర్తిగా విఫలం

కొత్తపేట: రాష్ట్రంలో రాజ్యాంగ పాలన పూర్తిగా విఫలమైందని కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. టీటీడీ లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై సిట్‌ చార్జ్‌షీట్‌ విడుదల చేసినా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఫొటోలతో ప్లెక్సీలు ఏర్పాటు చేసి, ప్రజల్లో కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడౖంపె తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం, కూటమి నాయకులు వ్యవహరిస్తున్న తప్పుడు విధానాలపై తగు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం నియోజకవర్గంలో నాలుగు మండలాల వైఎస్సార్‌ సీపీ ప్రతినిధులు కొత్తపేటలో డీఎస్పీ సుంకర మురళీమోహన్‌కు వినతిపత్రం సమర్పించారు. శాంతిభద్రతలకు భంగం కలిగేలా ఫ్లెక్సీలు పెట్టి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ప్రసాదానికి వాడే నెయ్యిలో గొడ్డుకొవ్వు, పందికొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను చంద్రబాబు అండ్‌ కో గాయపరిచారన్నారు. వాస్తవాలు బయటపడినప్పుడు నియంతలు ఎప్పుడూ హింసకే పాల్పడతారన్నారు. చంద్రబాబు ఏపీని జంగిల్‌రాజ్‌గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వులేదని ల్యాబ్‌లు తేల్చడంతో చంద్రబాబు అహం దెబ్బతిందన్నారు. చంద్రబాబును ప్రజలు ఛీదరించుకుంటున్నారన్నారు. అది తట్టుకోలేక డైవర్షన్‌ కోసం కుట్రలు పన్నారన్నారు. ప్రశ్నించేవారిని అంతం చేయాలన్నది చంద్రబాబు పథకమని ఆందోళన వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే వైఎస్సార్‌ సీపీ నాయకులపై వరుసగా దాడులు జరిగాయన్నారు. పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు, ఎంపీపీలు మార్గన గంగాధరరావు, తోరాటి లక్ష్మణరావు, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి సాకా ప్రసన్నకుమార్‌, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, తమ్మన శ్రీను, బొక్కా కరుణాకర్‌, మండల సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు నెల్లి లక్ష్మీపతిరావు, సర్పంచ్‌ రెడ్డి చంటి, రాష్ట్ర కాపు సంఘం నాయకుడు చల్లా ప్రభాకరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ యనమదల నాగేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ గుత్తుల భవాని పాల్గొన్నారు.

మండిపడిన వైఎస్సార్‌ సీపీ నేతలు

నాయకుల ఫొటోలతో

ప్లెక్సీల ఏర్పాటుపై నిరసన

కొత్తపేటలో డీఎస్పీకి ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement