ఆదమరిస్తే అంతా కాలీ
కుళ్లు తెగులు
నారుమడి నుంచి ప్రారంభమై.. నాటిన తోటలోనూ ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. ఆకుల అంచుల నుంచి పసుపు రంగుకు మారి ఈనెలు నల్లబడి కాండం కుళ్లిపోతుంది. ఈ తెగులు అధికంగా ఉంటే పువ్వును కూడా ఆశించి అది కూడా కుళ్లిపోతుంది.
నివారణ చర్యలు
ఈ తెగులు ఆశించిన తోట పూర్తి అయిన తరువాత మరలా ఇదే పంటను వేయకూడదు. పంట మార్పిడి తప్పని సరిగా చేయాలి. ఈ తెగులు ఆశించనట్లు గుర్తించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి మూడు గ్రాముల చొప్పన కలిపి మొక్క అంతా తడిచేలా పిచికారీ చేయాలి. ఇలా చేయటం వల్ల తెగులును కొంతవరకూ నివారించవచ్చు
ఫ కాలీఫ్లవర్ పంటపై తెగుళ్ల దాడి
ఫ సస్యరక్షణ చేపట్టకుంటే నష్టమే
ఫ రైతులకు అవగాహన కల్పిస్తున్న ఉద్యాన అధికారులు
ఫ జిల్లాలో 425 ఎకరాల్లో సాగు
పెరవలి: వాతావరణంలో వచ్చిన మార్పులతో కాలీఫ్లవర్ పంటను తెగుళ్లు ఆశిస్తున్నాయి. ఎండ, మంచు ప్రభావంతో తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటోంది. జిల్లాలో కూరగాయలను 2,795 హెక్టార్లలో సాగు చేస్తుండగా వీటిలో కాలీఫ్లవర్‌ను 425 ఎకరాల్లో పండిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో తెగుళ్ల ఆశించాయి. వీటి నివారణకు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొవ్వూరు ఉద్యానవన అధికారి డి.సుధీర్ కుమార్ తెలిపారు. ఈ పంటపై ప్రస్తుతం ఆకుమచ్చ, పచ్చపురుగు, బట్టవింగ్, రైసీనెస్, కొరడా తెగుళ్లుఎక్కువగా ఆశించాయి.
ఆకుమచ్చ తెగులు
ఈ తెగులు ఆశించిన తోటల ఆకులపై గుండ్రని బూడిద రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా పెద్దవిగా మారతాయి. ఈ తెగులు సాధారణంగా వాతవరణంలో తేమశాతం అధికంగా ఉన్నప్పుడు వ్యాప్తి చెందుతుంది.
నివారణ చర్యలు
ఈ తెగులు నివారణకు మాంకోజెబ్ మందును లీటరు నీటికి 2.5 గ్రాములు లేదా కాఫర్ ఆక్సీక్లోరైడ్‌ను లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేస్తే నివారణ అవుతుంది. తెగులు అధికంగా ఉంటే 10 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేయాలి.
రైసీనెస్
ఈ తెగులు వాతావరణంలో వేడి ప్రారంభమైనప్పుడు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు ఆశిస్తే పువ్వు వదులై, విచ్చుకున్నట్లుగా అయ్యి పువ్వు గుడ్డుపై మాగు వస్తుంది. దీని వల్ల పువ్వు అందవిహీనంగా కనిపించి మార్కెట్‌లో ధరపడిపోతుంది. దీని నివారణకు పువ్వులకు ఎండ ఎక్కువగా తగల కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పువ్వు విచ్చుకున్న వెంటనే సరైన సమయంలో పువ్వులను కోసి వేయాలి.
బట్టవింగ్
ఈ తెగులు ఆశించిన తోటల్లో పూలు చిన్నవిగా వస్తాయి. నత్రజని తక్కువగా అందించడం వల్ల, లేక ఆలస్యంగా నారు నాటటం వల్ల ఈ ప్రభావం కనిపిస్తుంది. దీనిని అరికట్టాలంటే 21 నుంచి 25 రోజుల వయసు కలిగిన నారును మాత్రమే నాటుకోవాలి, సరైన సమయానికి తగిన మోతాదులో నత్రజని ఎరువు అందించాలి. సరైన సమయంలో నాటుకోవాలి.
బ్రౌవింగ్ తెగులు
ఈ తెగులు బోరాన్ లోపం వల్ల వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా క్షార నేలల్లో ఈ పంటను వేసినప్పుడు తెగులు వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ తెగులు ఆశించిన పువ్వులపై గోధమరంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం గుల్లగా మారి నీరుకారుతుంది. దీని నివారణకు ఆఖరి దుక్కులో ఎకరాకు 8 నుంచి 10 కిలోల బోరాక్స్ వేయాలి. లీటర్ నీటిలో 3 గ్రాములు బోరాక్స్ కలిపి పువ్వు గడ్డ ఏర్పడే దశలో పిచికారీ చేయాలి.
కొరడా తెగులు
ఈ తెగులు వల్ల ఆకులు పసుపుగా మారి, అంచులు తెల్లబడతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకు మధ్య మాత్రమే పొడవుగా పెరుగుతుంది. ఇలా కొరడా తెగులు ఆశించినట్లు గుర్తించాలి. ఈ తెగులుకు కారణం నత్రజని మోతాదు ఎక్కువైతే మాలిబ్దినం మొక్కకు అందుబాటులో ఉండదు. దీని నివారణకు నత్రజనిని సరైన మోతాదులో అందించాలి. ఎకరాకు 400 గ్రాముల సోడియం లేదా అమ్మోనియం మాలిబ్డేట్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాలీప్లవర్ పువ్వు తెల్లగా ఉండాలంటే పువ్వు ఏర్పడిన దశలో పువ్వు చుట్టూ ఉన్న ఆకులను పువ్వుపై కప్పుతూ సూర్యరశ్మి సోకకుండా దారంతో కానీ రబ్బరు బ్యాండ్ కానీ వేయాలి. 4 నుంచి 5 రోజుల తరువాత పువ్వును కోయాలి.
ఆదమరిస్తే అంతా కాలీ
ఆదమరిస్తే అంతా కాలీ
ఆదమరిస్తే అంతా కాలీ
ఆదమరిస్తే అంతా కాలీ
ఆదమరిస్తే అంతా కాలీ
ఆదమరిస్తే అంతా కాలీ


